31 మందితో రేపే కిరణ్ కుమార్ క్యాబినెట్ ప్రమాణం

Kirankumar Reddy
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె. కిరణ్ కుమార్ రెడ్డి కొలువు రేపు ఆదివారం కొలువు తీరే అవకాశం ఉంది. ఆయన మంత్రివర్గం 31 మందితో ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఆయన మంత్రి వర్గం 11 మందితో మాత్రమే ఏర్పడుతుందని తొలుత జరిగిన ప్రచారం జరిగింది. దీనిపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. తొలుత 11 మందితో ఏర్పాటు చేసుకుని పక్షం రోజుల తర్వాత మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. రేపు ఆదివారం మధ్యాహ్నం లోగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాందీ మంత్రి వర్గ జాబితాకు ఆమోద ముద్ర వేశారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో చర్చలు జరిపిన తర్వాత జాబితాకు తుది రూపు ఇస్తారని అంటున్నారు. శనివారం సాయంత్రంలోగా తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.

వైయస్ జగన్ వర్గానికి చెందినవారికి పెద్దగా మంత్రివర్గంలో చోటు లభించకపోవచ్చునని అంటున్నారు. అయితే, తమకు సరెండర్ అయిన కొండ్రు మురళి వంటి జగన్ వర్గీయులకు మాత్రం మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలుంటాయని అంటున్నారు. తమకు పూర్తిగా సరెండర్ అయితే తప్ప వైయస్ జగన్ వర్గీయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించకూడదనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఆ మేరకే కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి సోనియా గాంధీతో పాటు అధిష్ఠానం పెద్దలను కలవడంలో బిజీగా ఉన్నారు. ఆయన శనివారం సాయంత్రమే హైదరాబాదుకు తిరిగి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పది నుంచి పదిహేను కొత్త ముఖాలు ఉంటాయని అంటున్నారు. పాలడుగు వెంకటరావు వంటి పార్టీ విధేయులకు తప్పనిసరిగా మంత్రి పదవులు ఇచ్చే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. బాలినేని శ్రీనివాస రెడ్డికి మాత్రం మొండిచేయే చూపే అవకాశం ఉంది. మంత్రివర్గంలో స్థానం కోసం ఢిల్లీ వచ్చిన వైయస్ జగన్ బాబాయ్ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+