వైయస్ వివేకానంద రెడ్డికి మంత్రి పదవి: వైయస్ జగన్ కు దెబ్బ?

గతంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో తనదైన ముద్ర కనబర్చిన ఆజాద్ ఈ సారీ ఇక్కడి వ్యవహారాల్లో చక్రం తిప్పబోతున్నట్లు సంకేతాలున్నాయి. అధిష్ఠానానికే సవాల్ విసురుతున్న జగన్‌ను నిలువరించేందుకు ఆయన కుటుంబమే సరైన ఆయుధంగా ఆజాద్ భావిస్తున్నారు. వివేకాకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వైఎస్ కుటుంబానికి అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తుందని సంకేతాలు పంపించాలన్నది ఆజాద్ వ్యూహంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో రెండు రోజులు గడిపిన ఆజాద్ శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాలపై అధిష్ఠానానికి రహస్య నివేదిక సమర్పించారని తెలిసింది. ఇక్కడి అస్తవ్యస్త పరిస్థితులు చక్కదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసినట్లు తెలిసింది.
ప్రస్తుతం ఆజాద్ తమిళనాడు, కర్ణాటక పార్టీ వ్యవహరాలను పర్యవేక్షిస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాల బాధ్యతల నుంచి తప్పించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు అప్పగించాలన్నది అధిష్ఠానం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో స్థానం కోసం డీఎల్ రవీంద్రారెడ్డి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలో వైఎస్ కుటుంబం అధిపత్యాన్ని రక్షించుకోవడానికే వివేకా ఢిల్లీకి చేరుకున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications