జగన్ కు, అధిష్టానానికి మధ్య ఎడబాటు తొలగించడానికే :వైయస్ వివేకా

వైయస్ జగన్ సహా తమ కుటుంబమంతా కాంగ్రెసు పార్టీ పటిష్టతకు కృషి చేస్తుందని ఆయన చెప్పారు. తాను ఢిల్లీకి వచ్చేప్పుడు వైయస్ జగన్ లేరని, అందుకే చెప్పి రాలేదని, తాను హైదరాబాదు వెళ్లిన తర్వాత జగన్ ను కలుస్తానని, కార్యకర్తలను కూడా కలుస్తానని ఆయన చెప్పారు. మరోసారి వైయస్ జగన్ తో కలిసి వచ్చి సోనియాను కలుస్తానని ఆయన చెప్పారు. వైయస్ జగన్ ప్రజాకర్షణ ఉన్న నాయకుడని ఆయన చెప్పారు. వైయస్ జగన్ వ్యవహారం చిన్న సమస్య అని, అది పరిష్కారమవుతుందని ఆయన చెప్పారు. వైయస్ జగన్ ను దెబ్బ తీయడానికే మీకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం చూస్తోందనే వార్తలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు అనగా, వైయస్ జగన్ తో సయోధ్య కోసం తనను మంత్రివర్గంలోకి తీసుకుంటుందని ఎందుకు అనుకోరని ఆయన అడిగారు. తనను వాడుకుని వైయస్ జగన్ ను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోందని ఎందుకు అనుకోకూడదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications