వైయస్ జగన్ పైనే ప్రజారాజ్యం అధినేత చిరంజీవి జాతకం

మంత్రివర్గంలో చేరికపై ప్రజారాజ్యంలో ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో చేరితే మేలని కొందరు, చేరకుండా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. శాసనసభ్యుల్లో అత్యధికులు ప్రభుత్వంలో చేరితేనే పార్టీ బలోపేతమవుతుందని అంటున్నారు. సీనియర్ నేతలు మాత్రం ప్రభుత్వంపై విభజన, సమైక్య ఉద్యమాల ప్రభావం, అధికారంలో భాగం పంచుకుంటే దీర్ఘకాలంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని ఏకరవు పెడుతున్నారు. మొత్తమ్మీద రానున్న కొద్దివారాల్లో చోటుచేసుకునే రాజకీయ పరిణామాల ఆధారంగానే ప్రరాపా తుదినిర్ణయం తీసుకునే వీలుంది.












Click it and Unblock the Notifications