పిసిసి చీఫ్ కిరణ్ కుమార్ మిత్రుడు దామోదరం రాజనర్సింహ?

Damodara Rajanarsimha
న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణ కసరత్తు దాదాపు పూర్తి అయినట్లు కనిపిస్తోంది. ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రి పదవి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే అనంతపూర్, కర్నూల్, మెదక్ జిల్లాలనుండి మాత్రం ఇద్దరి చొప్పున మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమయినట్లు తెలుస్తోంది. మొత్తం 30మందికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు. మెదక్ జిల్లాలో దామోదర రాజనర్సింహకు పిసిసి చీఫ్పదవి ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు ప్రణబ్ తో భేటీ అనంతరం పూర్తి జాబితా రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ పిసిసి చీఫ్ కాకపోతే ఉప ముఖ్యమంత్రి పదవి అయినా దామోదరం రాజనర్సింహను వరించే అవకాశం ఉంది.

కడప పార్లమెంటు సభ్యుడు జగన్ వర్గానికి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిలను దూరం పెట్టితే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో చర్చిస్తున్నారు. కిరణ్ సైతం 10 మంది కొత్తవారికి అవకాశమిచ్చేందుకు ఆలోచిస్తున్నారు. కర్నూలు జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి, టిజి వెంకటేష్ లలో పోటీ నెలకొనటంతో ఇద్దరికి ఇచ్చే అవకాశముంది. దామోదరకు రాజనర్సింహకు పిసిసి పదవి ఇస్తే రెండు రకాలుగా లబ్ధి పొందవచ్చునని అధిష్టానం భావిస్తోంది. దామోదర తెలంగాణ వ్యక్తి కావటం ఒకటి అయితే, ఆయన మాదిగ వర్గానికి చెందిన వాడు కావటం రెండో కారణం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తమకు సరియైన ప్రాతినిధ్యం ఇవ్వలేదనే భావనలో మాదిగలు ఉన్నారు. దామోదరకు ఇస్తే ఆ అపప్రద తొలగిపోతుందని భావిస్తున్నారు. దామోదరం రాజనర్సింహ కిరణ్ కుమార్ కు సన్నిహిత మిత్రుడు. ఇద్దరు కలిసి చదువుకున్నారు.

అంతకుముందు కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. ఆ తరువాత అహ్మద్ పటేల్ తో భేటీ అయ్యారు. సోమవారం సోనియాగాంధీతో మరోసారి భేటీ ఆయ్యే అవకాశముంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరో రెండ్రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, స్పీకర్‌ అభ్యర్థులు కూడా ఖరారయ్యాకే సీఎం తిరుగప్రయాణం కానున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం తుదిజాబితా ఖారారు అయ్యాక మిగతా పదవులపై ముఖ్యమంత్రి కసరత్తు చేయనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరిగివచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+