కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరరాదని చిరంజీవి నిర్ణయం

తెలంగాణ ప్రాంతానికి చెందిన నిర్మల్, బాల్కొండ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, అనిల్‌లు చిరంజీవి నివాసంలో సోమవారం రాత్రి జరిగిన సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో మహేశ్వర్‌రెడ్డి తెలంగాణ అంశాన్ని ప్రస్తావించగా శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే ప్రకటించాం కదా అని చిరంజీవి బదులిచ్చినట్లు తెలిసింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి హాజరు కాకపోవడం విశేషం. ప్రజారాజ్యానిది నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రేనని ఆ పార్టీ సీనియర్ నేత వేదవ్యాస్, ఎమ్మెల్యే కన్నబాబులు స్పష్టం చేశారు. చిరంజీవి నివాసంలో సోమవారం రాత్రి సమావేశం ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే అభినందిస్తామని, సహకరిస్తామని, ప్రజల్ని ఇబ్బంది పెడితే ఉద్యమిస్తామని వివరించారు. ప్రభుత్వంలో చేరే అవకాశం లేదని తెలిపారు. ప్రభుత్వం పడిపోకుండా అవసరమైతే మద్దతిస్తామని గతంలో చిరంజీవి అన్నమాట వాస్తవమైనా.. సంక్షోభం వచ్చినప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు గురించి ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిరంజీవికి ఫోన్ చేశారని, అది కేవలం మర్యాద పూర్వకంగా చేసిందేనని వెల్లడించారు. సీఎం, చిరులమధ్య ఎప్పుడైనా సమావేశం జరగొచ్చనీ, అదికూడా కేవలం మర్యాద పూర్వకంగానే ఉంటుందని వివరించారు.












Click it and Unblock the Notifications