వైయస్ జగన్ ఎప్పుడైనా పార్టీని ప్రకటించవచ్చు: చెవిరెడ్డి

YS Jagan
చిత్తూరు: పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం ఖాయమని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) మాజీ చైర్మన్, జగన్ వర్గం కాంగ్రెస్ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి మంగళవారం అన్నారు. జగన్ తన పార్టీని ఎప్పుడైనా ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్నారు. జగన్ చేపడుతున్న ఓదార్పుకు, పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. వైయస్ వివేకానందరెడ్డి కుయుక్తులు గత మూడు నాలుగు నెలలుగా కొనసాగుతున్నాయన్నారు.

కాగా వైయస్ వివేకానంద తీసుకున్న నిర్ణయం సరైనదని కాంగ్రెస్ శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. వివేకానంద కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టు నడుచుకుంటానని ప్రకటించడం ముదావహమని చెప్పారు. తమకు మంత్రి పదవి వచ్చినా రాకున్న ఫరవాలేదన్నారు. మంత్రి పదవి తమకు ముఖ్యం కాదన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ తమ పోరాటం సాగుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+