చిరంజీవి పదవులో కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేయలేదు: వంగా గీత

అవసరమైతే కాంగ్రెసు పార్టీని ఆదుకుంటామని చిరంజీవి ప్రకటన చేసిన మాట వాస్తవమేనని, అయితే ఆదుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదని ఆమె అన్నారు. తమ అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వంలో చేరడం లేదని చిరంజీవి ప్రకటన చేశారని ఆమె చెప్పారు. తాము ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని ఆమె చెప్పారు. తమ పార్టీ శాసనసభ్యుల్లో విభేదాలు లేవని, తామంతా చిరంజీవి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆమె చెప్పారు. ఎవరు బలపడతారో, ఎవరు బలహీన పడుతారో భవిష్యత్తు తేలుస్తుందని ఆమె ఓ ప్రశ్నకు సమాధానం అన్నారు.












Click it and Unblock the Notifications