రాజీకి వట్టి వసంత కుమార్ నో: ఫలించని మంత్రుల దౌత్యం

Vatti Vasanth Kumar
హైదరాబాద్‌: రాజీకి వట్టి వసంత కుమార్ నిరాకరిస్తున్నారు. తనకు కేటాయించిన శాఖపై అలిగి వట్టి వసంతకుమార్ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శాసనసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకున్నప్పటికీ మంత్రి పదవికి చేసిన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గడానికి నిరాకరిస్తున్నారు. శాఖ కేటాయింపుపై పార్టీ అధిష్టానంతోనే తేల్చుకుంటానని ఆయన మొండికేస్తున్నారు. గురువారం సాయంత్రం మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత వట్టి వసంత కుమార్ తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, కె. జానారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి చర్చలు జరిపారు. అయితే ఆయన ఏ మాత్రం మెత్తబడలేదు.

కాగా, వట్టి వసంతకుమార్ ను దారికి తెచ్చేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. వసంతకుమార్ తో చర్చలు జరిపేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, కావూరి సాంబశివ రావును హైదరాబాదుకు పంపుతున్నట్లు సమాచారం. ఇంతకు ముందు తాను నిర్వహించిన గ్రామీణాభివృద్ధి శాఖను తన నుంచి తప్పించడానికి మైక్రో ఫైనాన్స్ సంస్థల ఒత్తిడే కారణమని వట్టి వసంతకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మైక్రో ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి వల్లనే తనకు ప్రాధాన్యం లేని శాఖను కిరణ్ కుమార్ రెడ్డి కేటాయించినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+