జగన్ పార్టీ ప్రకటనతో తెలంగాణపై కేంద్రం వెనకడుగు వేయదు!

తెలంగాణ వాదం తెలంగాణలోని పది జిల్లాల్లో గ్రామగ్రామాణ విస్తరించిందన్నారు. తెలంగాణ ఇప్పుడు కాకున్నా ఎప్పటికైనా ప్రకటించాల్సిందేనని ఆయన చెప్పారు. తెలంగాణ వాదం ప్రజలందరిలోనూ ఉన్నందున మాయమాటలు చెప్పి రాజకీయ పార్టీలు వారికి తప్పించుకోలేవని అన్నారు. వారిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్లనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరికైనా రాజకీయ లబ్ధికన్నా దేశహితం ముఖ్యమని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications