ప్రత్యర్థులు ఎవరనేది కాదు: జగన్ పై సిఎం కిరణ్ కామెంట్

మంత్రిగా పని చేస్తే ఏదో ఒక శాఖను మంత్రిమే పరీశీలించడానికి అవకాశముంటుందని ఆయితే తాను చీప్ విప్ చేసినందున అన్ని శాఖలను పరిశీలించే అవకాశం దక్కిందన్నారు. ఈ కారణంగా అన్ని శాఖలపై తనకు పట్టుందన్నారు. ముఖ్యమంత్రిగా తనకంటూ ఓ ముద్ర కంటే ముసాయిదా(మేనిఫెస్టో) అమలు చేయటమే తన ముద్రగా చెప్పారు. త్వరలో నామినేటెడ్ పోస్టల భర్తీని పూర్తి చేస్తామని కిరణ్ తెలిపారు. దివంగత వైయస్ కాంగ్రెసు ఆస్తి అని ఆయన చెప్పారు. వైయస్ కాంగ్రెసు అభ్యున్నతికి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డ వ్యక్తి అని ఆయన ఎన్ని అవాంతరాలు వచ్చినా కాంగ్రెసు లోనే కొనసాగారని, కాంగ్రెసు ని ఎక్కువగా అభిమానించేవారన్నారు.
అందుకే ఆయన కాంగ్రెసు ఆస్తి అని చెప్పారు. వైయస్ చేపట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ అర్హులైన ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసి పాలన కొనసాగిస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రి కాగనే శుభాకాంక్షలు తెలిపారన్నారు. అయితే తాను సాగిస్తున్న పాలనను ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు ఉండకూడదన్నారు.
డిసెంబర్ 31 తర్వాత ప్రభుత్వానికి ఎలాంటి టెన్షన్ లేదని కిరణ్ చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనంతరం అంతా చక్కబడుతుందన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి మేం కట్టుబడి ఉంటామన్నారు. మంత్రుల్లో అసంతృప్తి అనేది మీడియానే తిరగ తోడుతుందన్నారు. మంత్రుల్లో ఆసంతృప్తి పదిగంటల్లోనే సమసిపోయిందన్నారు. ఇప్పుడు సంతృప్తి, అసంతృప్తి ఎవరికీ లేదని అంతా కలిసి కట్టుగా పని చేయడానికి పూనుకున్నామన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో గత పదిహేనేళ్లుగా తనకు రాజకీయ శతృత్వం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications