వైయస్ జగన్ శిబిరంలో ప్రస్తుతానికి చేరను: రాయపాటి సాంబశివరావు

తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ఆదివారంనాడు చెప్పారు. రెండు మూడు రోజులు రాయపాటి సాంబశివరావు హైదరాబాదులోనే ఉంటారు. ఈ సమయంలో ఆయన తన అనుచరులతో మాట్లాడుతారని తెలుస్తోంది. వ్యూహాత్మకంగానే ఆయన ప్రస్తుతానికి వైయస్ జగన్ పార్టీలో చేరబోనని ఆయన చెబుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మినారాయణకు మంత్రి పదవి ఇచ్చి, తన సోదరుడు రాయపాటి శ్రీనివాస్ కు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పైగా చాలా కాలంగా కన్నా లక్ష్మినారాయణకు, రాయపాటికి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అది కోర్టులకు కూడా ఎక్కింది.












Click it and Unblock the Notifications