రాజకీయాల నుంచి తప్పుకుంటా: రాయపాటి సంచలన ప్రకటన

'మంత్రులు సరైన వారు రావట్లేదు. జిల్లాకు రప్పించాల్సిన రైల్వే సర్వీసులు, అభివృద్ధి పనులు చేజారిపోతున్నాయి. అన్నీ బెంగాల్‌కే తరలిపోతున్నాయి. గతంలో తలపెట్టిన అభివృద్ధి పనులనూ కొనసాగించలేని దుస్థితి నెలకొంద'ని చెప్పారు. అన్ని పార్టీల నుంచి ఉన్న ఒత్తిడితో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. అవినీతి అంశాలను గతంలో అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా, పలుమార్లు సీఎంకు చెప్పినా నిరుపయోగంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలే బాసులుగా చెలామణి అవుతున్నారని, వారి మాటే చెల్లుబాటవుతోందన్నారు. ఏ పార్టీలోనూ చేరనని, ఇక పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.












Click it and Unblock the Notifications