ప్రాధేయపడినా సోనియా గాంధీ మనసు కరగలేదు: వైయస్ జగన్

YS Jagan
కడప: ఓదార్పు యాత్రకు అనుమతించాలని ప్రాధేయపడినా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మనసు కరగలేదని వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. కడప జిల్లా పులివెందులలో మంగళవారం ఉదయం జరిగిన అభిమానుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తాను కాంగ్రెసు నుంచి బయటకు రావాల్సిన పరిస్థితిని ఎలా కల్పించారో ఆయన వివరించారు. మనసును చంపుకుని ఓదార్పు యాత్రకు అనుమతించాలని సోనియాను ప్రాధేయపడ్డామని, అయినా సోనియా మనసు కరగలేదని ఆయన అన్నారు. జిల్లా కేంద్రానికి పిలిపించి ఆర్థిక సాయం చేయాలని సూచించారని, వైయస్సార్ మరణానికి గుండె చెదిరి ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు తనను సాయం చేయాలని అడగలేదని, సంప్రదాయం ప్రకారం బాధితుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఓదార్పడం సంప్రదాయమని, ఆ సంప్రదాయాన్నే తాను పాటించదలుచుకున్నానని ఆయన వివరించారు.

ఈ 15 నెలల కాలంలో జరుగుతున్న పరిణామాలను మీరు చూస్తూనే ఉన్నారని, ఈ కాలంలో తాను చేసిన తప్పేమిటని ప్రశ్నించుకున్నానని, తాను ఒక్క తప్పు కూడా చేయలేదని ఆయన అన్నారు. ఒక వైపు తనను రాజకీయాల్లో పైకి తెస్తామని అంటూ ఓదార్పు యాత్రను రద్దు చేసుకోవాలని సోనియా చెబుతున్నారు, మరో వైపు తాను ప్రజలకు ఇచ్చి మాట ఉంది, ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించానని ఆయన అన్నారు. మాట మీద నిలబడితే కష్టాలు, నష్టాలు తప్పవని తెలుసునని, అయితే మాట మీద నిలబడాలని నాన్న నేర్పిన విధంగానే నడుచుకోవాలని అనుకున్నానని ఆయన చెప్పారు. ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు, బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యమని నాన్న చెప్పేవారని, అదే తనను ముందుకు నడిపిస్తోందని ఆయన అన్నారు.

మాట మీద నిలబడాలనే మనస్సాక్షి ప్రకారం నడుచుకుని ముందుకు సాగే సరికి తనకు, సోనియాకూ కాంగ్రెసు అధిష్టానానికీ మధ్య తేడాలు పెరిగాయని, వైయస్సార్ వల్ల ఓటు పొందినవారిని ఆలోచించుకోవాలని చెప్పానని, అయితే మంత్రులకు, మంత్రుల ద్వారా శాసనసభ్యులకు ఫోన్లు చేసి ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని చెప్పారని ఆయన అన్నారు. తన సాక్షి కార్యాలయాలపై దాడులు చేయించారని, అది తన పని కాదనీ పైనుంచి ఆదేశాలు ఉన్నాయనీ అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారని, ఆ దాడులతో తనకు బాధ కలిగిందని, తెలుగుదేశం ప్రభుత్వంలో అలాంటి దాడులు జరిగి ఉంటే ఎదుర్కుని ఉండేవాడినని ఆయన అన్నారు. చిన్నపిల్లాడిని లాగి చెంప మీద కొట్టి పంపినట్లు తనను పార్టీ నుంచి పంపించివేశారని, సహనం కోల్పోయి పార్టీ నుంచి బయటకు వచ్చానని, ఒంటరిగా పంపించాలని కాంగ్రెసు నాయకత్వం భావించిందని, ఒంటరిగానే బయటకు వచ్చానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+