నన్ను సిఎంగా ఎందుకు చేశారో తెలియదు: కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా తనను ఎందుకు నియమించారో తనకు తెలియదని, కానీ కాంగ్రెసుపార్టీని బలోపేతం చేసి తిరిగి అధికారంలోకి తెచ్చే బాధ్యత తనపై ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) ఆఫీసు బేరర్ల సమావేశంలో ఆయన బుధవారం ప్రసంగించారు. పార్టీని వ్యతిరేకించడం గానీ పార్టీని విస్మరించడం గానీ జరగదని ఆయన అన్నారు. పార్టీని బలోపేతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెసు పార్టీ జీవనది అని, ఎవరు వీడిపోయినా పార్టీకి ఏ విధమైన ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తనకు అప్పగించిన బాధ్యతను ప్రజల మేలు కోసం, పార్టీ పటిష్టత కోసం ఉపయోగిస్తానని ఆయన చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

వైయస్ రాజశేఖర రెడ్డి, కె. రోశయ్య లేకుండా ప్రభుత్వాన్ని నడపడం కష్టమేనని ఆయన అన్నారు. శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత పార్టీ కార్యకర్తలను విస్మరించడం మంచి పద్ధతి కాదని ఆయన హితవు చెప్పారు. ప్రతి కార్యకర్తను గుర్తుంచుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. తాను తక్కువగా మాట్లాడి ఎక్కువ పనిచేస్తానని ఆయన చెప్పారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. జిల్లాలన్నీ పర్యటించిన తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో మాట్లాడి వాటిని భర్తీ చేస్తానని ఆయన చెప్పారు. శాసనసభ స్పీకర్ ఎవరనేది రెండు రోజుల్లో తేలిపోతుందని ఆయన చెప్పారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+