చిన్నాన్న అవతలివైపు ఉన్నారని అంటున్నారు: వైయస్ జగన్

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని వైయస్ జగన్ విమర్శలు గుప్పించారు. బుధవారం ఉదయం ఆయన పులివెందుల మండలం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఓదార్పు యాత్రను చేపట్టవద్దనే సోనియా మాటలు వింటే తనకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండేదని, తనకు మంచి స్థితిని కల్పిస్తానని సోనియా చెప్పారని, అయితే నల్ల కాలువ వద్ద ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అనుకున్నానని, కష్టాలుంటాయని తెలిసి నాన్న చెప్పిన ఈ మార్గాన్నే ఎంచుకున్నానని ఆయన చెప్పారు.
ఓదార్పు యాత్రను అనుమతించాలని ప్రాధేయపడినప్పుడు సోనియా ఏం చెప్పారు, తాను ఎలా మథనపడ్డాను అనే విషయాలను ఆయన వివరించారు. పార్టీ నుంచి తనను పంపించివేయడానికి కుట్ర జరిగిందని ఆయన అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డికి ఆశ పెట్టి కుటుంబాన్ని చీల్చారని ప్రస్తావించారు. దాదాపుగా ఆయన బుధవారం చేసిన ప్రసంగంలో మంగళవారం చేసిన ప్రసంగంలోని అంశాలే ప్రధానంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications