రైతు జీవితాల నిండా కన్నీళ్లే: అఖిలపక్ష ధర్నాలో చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ తెలుగుదేశం, లోక్ సత్తా, సిపిఎం, సిపిఐ పార్టీలు శుక్రవారం ఉదయం గన్ పార్కు వద్ద ఆందోళన నిర్వహించాయి. అనంతరం వారు ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఓవైపు వ్యవసాయ ఖర్చులు పెరిగిపోతుంటే మరోవైపు వరదలు, తుఫాను వంటి ప్రకృతి విపత్తులతో పంటలు కొట్టుకు పోతున్నాయన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు దిక్కులేని స్థితిలో ఉన్నారన్నారు.

కుటుంబాన్ని వెళ్లదీయలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పత్తి, వరి రైతు కళ్లల్లో కన్నీళ్లే మిగిలాయన్నారు. అన్ని పార్టీలు కలిసి రైతుల పక్షాన పోరాడటానికి సిద్ధమయ్యాయన్నారు. ఇప్పటికై ప్రభుత్వం రైతుల వెతలు పట్టించుకోవాలన్నారు. రైతులకు న్యాయం జరికే వరకు పోరాటం ఆపమన్నారు. అంతేకాకుండా గత సంవత్సరం చిదంబరం ఉద్యామాలు చేసిన విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తానని మాట ఇచ్చి ఇప్పటి వరకు ఎత్తివేయక పోవడానికి గల కారణాలు చెప్పాలన్నారు. విద్యార్థులపై భేషరతుగా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

రైతు సమస్యలపై పార్టీలు వేరువేరుగా లేవని అన్నీ రైతు పార్టీలేనని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. లక్షలాది ఎకరాలు నీటిలో కొట్టుకు పోయి అన్నదాత పరిస్థితి దారుణంగా తయారయిందన్నారు. తడిసిన బియ్యాన్ని ఉప్పుబియ్యంగాగానీ, సన్న బియ్యంగా గానీ చేసి ప్రభుత్వం అమ్మాలని చెప్పారు. ఎకరాకు 4వేల నుండి 5వేల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. అన్ని పార్టీలు కలిసి వ్యవసాయరంగాన్ని ఆదుకోవాల్సి ఉందన్నారు. గ్రామాన్ని, వ్యవసాయాన్ని రక్షించుకోవాలన్నారు. పార్టీలన్నీ ఒకే త్రాటిపై ఉన్నట్టు ప్రభుత్వం కూడా రైతుల సమస్యలపై ఆ త్రాటిపైకి రావాలన్నారు. రైతులు నష్టపోయి ఆవేదనతో ఉంటే ప్రభుత్వం చూస్తూ కూర్చుందని గుండా మల్లేషం ధ్వజమెత్తారు. రైతులనుండి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+