సభలో అవినీతి, వైఫల్యాలు చర్చకు రావద్దనే: కిషన్ రెడ్డి

ఏడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ ప్రజ సమస్యలు పట్టించుకున్నది లేదన్నారు. రాష్ట్రంలో పథకాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నాయన్నారు. 2 రూపాయలకు కిలో బియ్య, వర్గీకరణ, జలయజ్ఞం కార్యక్రమాలు మందగించాయన్నారు. వర్గీకరణపై ఏడేళ్లుగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. వరదలు, తుఫాను తదితర క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అడిగిన మొత్తంలో 4శాతం సహాయం కూడా చేయలేదన్నారు. 42వేల కోట్ల రూపాయలను అడిగితే వెయ్యి కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. రైతు సమస్యలపై చర్చించుదామని అధికార పక్షానికి ముందే చెప్పామని అయినప్పటికీ ఆ దిశలో అధికార పక్షం ముందుకు పోవటం లేదన్నారు.












Click it and Unblock the Notifications