పిసిసి అధ్యక్షుడిగా షబ్బీర్ అలీ, ప్లీనరీ తర్వాత అధికారిక ప్రకటన?

కాగా కేంద్ర నాయకుడు గులాంనబీ ఆజాద్ తో ఉన్న మంచి సంబంధాల కారణంగానే షబ్బీర్ అలీకి ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అల్పసంఖ్యాకవర్గ కోటాలో కూడా షబ్బీర్ ను పిసిసి అధ్యక్షుడిగా తీసుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో షబ్బీర్ అలీకి మంచి సంబంధాలు ఉండేవి. ఓదార్పు యాత్ర వరకు కూడా జగన్ తో షబ్బీర్ అలీకి మంచి సంబంధాలు ఉండేవి.
ఆయితే ఆయన పార్టీనుండి బయటకు వెళ్లడంతో అల్పసంఖ్యాకవర్గాలతో పాటు జగన్ వర్గానికి చెక్ పెట్టడానికి షబ్బీర్ అలీనే మంచి ఆయుధంగా అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ, సీమాంధ్రలలో ఏదో ఒక ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున వెలిసే నేపథ్యంలో షబ్బీర్ అలీ పిసిసి అధ్యక్షుడిగా ముస్లింల ఆగ్రహానికి గురయ్యే విషయాన్ని యోచిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications