విద్యార్థులపై కేసుల ఎత్తివేత మీద నిపుణుల సలహాలు: కిరణ్ కుమార్

రాజ్యాంగ విరుద్ధంగా విధ్వంసానికి పాల్పడ్డ వారిపై కేసులు ఎత్తివేసే అధికారం ఎవరికీ లేదని లోక్ సత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారం అన్నారు. అసంబ్లీ రెండోసారి వాయిదా పడిన అనంతరం అయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చిదంబరం కేసు ఎత్తివేస్తానని చెప్పటం తప్పేనని చెప్పారు. ఎవరిపైనైనా కేసులు చట్ట ప్రకారమే ఎత్తివేయాల్సి ఉంటుందన్నారు. ఆ కేసులు ఎత్తివేసే అధికారం ఎవరికీ ఉండదన్నారు. బలవంతపు వసూళ్లపై కొందరు భయంతో ఫిర్యాదులు చేయటం లేదని జెపి ఆరోపించారు. గత కొద్దిరోజులుగా పార్లమెంటు సమావేశాలు స్తంభించినట్లే అసెంబ్లీ సమావేశాలను స్తంభింప చేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications