బెజవాడలో రామ్ గోపాల్ వర్మ హల్ చల్: దేవినేని నెహ్రూతో భేటీ

ముఠా కక్షలకు, హత్యలకు, ప్రతీకార హత్యలకు పేరు మోసిన విజయవాడ రాజకీయాలను ఆయన తెరకెక్కించే ఉద్దేశంతో బెజవాడ రౌడీలు సినిమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. రామ్ గోపాల్ వర్మ శనివారం ఉదయం కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూతో సమావేశమయ్యారు. నెహ్రూతో ఆయన సోదరుడు బాజీ ప్రసాద్ తో ఆయన చర్చలు జరిపారు. వంగవీటి రంగా భార్య రత్నకుమారిని కూడా కలుసుకోవాలని ఆయన అనుకున్నారు. అయితే, ఆమె స్థానికంగా లేకపోవడంతో వీలు కాలేదని తెలుస్తోంది. ముఠా కక్షలకు ఆది సంఘటనకు మూలమైన చలసాని వెంకటరావు కుమారుడితో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణను ఆయన కలుసుకుంటారా, లేదా అనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications