ప్రభుత్వానికి మానవత్వం లేదు: రైతు సమస్యలపై అసెంబ్లీలో చంద్రబాబు

పంట నష్టపోయిన వారిలో ఎక్కువగా కౌలు రైతులే ఉన్నారన్నారు. ఉత్తరాంధ్రలో లక్షల ఎకరాల్లో పంట నష్ట పోయారన్నారు. రాష్ట్రంలో వరుసగా వచ్చిన తుఫానుతో రైతులు, కౌలుదార్లు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే తప్ప రైతులకు న్యాయం జరగదన్నారు. పంట నష్టంపై జిల్లాలకు వెళ్లి తేల్చుకుందాం రండి అని ప్రభుత్వానికి బాబు సవాలు విసిరారు. ప్రభుత్వ లెక్క ప్రకారమే 10.22 లక్షల ఎకరాల పంటనష్టము జరిగిందన్నారు. రైతాంగానికి పెద్ద విపత్తు వచ్చిందన్నారు.
రైతులకు ఇలాంటి విపత్తు ఎన్నడూ రాలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే సహాయం రైతులకు ఏమూల సరిపోదన్నారు. రైతుకు పంటల ఖర్చులు అన్ని విధాలుగా పెరిగిపోయాయన్నారు. దీంతో రైతులకు ఇచ్చే పరిహారం నామమాత్రంగా ఉందన్నారు. ప్రభుత్వ లోపాల వల్ల రైతులకు సమస్యలు వస్తున్నాయన్నారు. ఎరువులే ఇందుకు మంచి నిదర్శనమని చెప్పారు. ఆదర్శ రైతులు ఇంత వరకు పొలాలను పరిశీలించింది లేదన్నారు. ఆదర్శ రైతులలో పొలం లేని వారు కూడా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications