రైతు వ్యతిరేక ప్రభుత్వం: కాంగ్రెసు పై నాగం జనార్ధన్ రెడ్డి ఫైర్

Nagam Janardhan Reddy
హైదరాబాద్: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని తెలుగుదేశం పార్టీ శాననసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం కాంగ్రెసు ప్రభుత్వంపై అసెంబ్లీ మీడియా పాయింటువద్ద విడుచుకుపడ్డారు. రైతులకు న్యాయం చేయాలంటూ అసెంబ్లీ వద్ద విపక్షాలు ధర్నా చేస్తున్నాయి. ఈ సందర్భంగా నాగం మాట్లాడుతూ రైతులకు వ్యతిరేక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండటం సిగ్గుచేటు అన్నారు. రైతులు పత్తి, వేరుశనగ, వరి రైతులను తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేయటమే కాకుండా మోసం చేస్తుందన్నారు.

రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వ చర్యలు ఉంటే కాంగ్రెసు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. రైతు నాయకులు తమ సమస్యలు చెప్పడానికి ముఖ్యమంత్రిని, ప్రతిపక్షనేతను, శాసనసభాపతిని కలవడానికి వస్తే అరెస్టు చేయటం విడ్డూరమన్నారు. తమ సమస్యలు విన్నవించుకునేందుకు రైతు నాయకులకు ఎందుకు అవకాశమివ్వరని నాగం ప్రశ్నించారు. రైతుల సమస్యలు తీర్చాలని పోరాటం చేస్తున్న ప్రతిపక్షనాయకులను కూడా ప్రభుత్వం అరెస్టు చేసి రైతులను తమకున్న వ్యతిరేకతను చాటుకున్నాయన్నారు.

ప్రభుత్వం విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీరు ఉద్యమంలో పాల్గొనకండి మీ ఉద్యమం ఎత్తివేస్తామన్నట్లు ఆ ప్రకటన ఉందన్నారు. 1969లో అప్పుడు కూడా మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు కాంగ్రెసు ప్రభుత్వం మమ్మల్ని జైళ్లకి పంపిందని, ఇప్పుడు కూడా విద్యార్థులతో పాటు జైళ్లకు వెళ్లడానికి తెలంగాణ తెలుగుదేశం సిద్ధంగా ఉందన్నారు. హోంమంత్రి ప్రకటనకు తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు వివరణ ఇవ్వాలన్నారు. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు వెంటనే ఎత్తివేయాలని నాగం డిమాండు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+