కిరణ్ కు వైయస్ జగన్ అల్టిమేటం: 48 గంటలు నిరాహార దీక్ష

YS Jagan
మచిలీపట్నం: మొదటిసారి వైయస్ జగన్ ప్రజా సమస్యలపై పోరుబాటకు శ్రీకారం చుడుతున్నారు. రైతులు, చేనేత కార్మికుల సమస్యలు ఈ నెల 20వ తేదీలోగా పరిష్కరించకుంటే ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడ వేదికగా 48 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రైతులు, చేనేత కార్మికులతో పెద్దయెత్తున సామూహిక నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఇస్తున్నామని, కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని అన్నారు. కౌలు రైతుల సమస్యలపై స్పందించని పక్షంలో ప్రభుత్వానికి దారుణ పరిస్థితులు ఎదురవుతాయన్నారు.

ప్రభుత్వం 9 గంటలపాటు ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదని, వైఎస్‌ హయాంలో ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేశారన్నారు. పంటలు నష్టపోయి నిండా మునిగి పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు వచ్చిన తనను రైతులే పరామర్శిస్తున్నారని జగన్‌ అన్నారు. రైతులను పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ మూడోరోజు యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి, లక్ష్మీపురం మీదుగా బందరుకు వచ్చారు. ఇంతటి కష్టంలో ఉన్న రైతును ఇప్పుడు ఆదుకుంటే ఇంకా ఎప్పుడు ఆందుకుంటారని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా యాత్ర సందర్భంగా చేసిన వడ్డీ మాఫీ, రైతులకు రబీకి ఉచిత ఎరువులు, ఉచిత విత్తనాలు, ఏడాదిపాటు అప్పుల రికవరీ నిలిపివేత తదితర డిమాండ్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే రీతిలో వ్యవహరిస్తే మూడున్నరేళ్లలో కూకటి వేళ్లలో కూలిపోతుందని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+