కనిమొళికి ఎల్టీటీఈతో సంబంధాలు? దెబ్బతింటున్న డిఎంకే పార్టీ ప్రతిష్ట

ట్రాయ్ మాజీ అధ్యక్షుడు ప్రదీప్ బైజల్ నివాసంలో కూడా సీబీఐ సోదాలు చేస్తోంది. 2008లో ఆయన ట్రాయ్ రాజీనామా చేశారు. ఆయన అప్పటినుండి 2009 వరకు రాడీయాతో పని చేశారు. ఆయనను అదుపులోకి తీసుకుంది. రాజా, కనిమొళిలు జగత్ గాస్పర్ ను అడ్డుగా పెట్టుకొని లావాదేవీలు జరిపారని తెలుస్తోంది. కనిమొళి తల్లి ఇంటిపైన, ఆమె ఆడిటర్ ఇంటిపైనా, ఎన్టీవోలపైనా, జర్నలిస్టులపైనా, తమిళనాడుకు చెందిన 11 మంది ముఖ్య అధికారులపైన, దాడులు చేశారు. కనిమొళితో రాజాకు ఉన్న అనుబంధమే కరుణానిధి అభయానికి కారణంగా కొందరు పేర్కొంటున్నారు.
నక్కీరన్ పత్రిక అసోసియేట్ ఎడిటర్ కామరాజు ఇంటిపైనా దాడులు నిర్వహించారు. రాజా ఇంటితో పాటు ఆయన బంధువులకు, సన్నిహితులకు చెందిన వారిపై దాడులు చేసింది. సిబిఐ 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించడంతో సిబిఐ దేశవ్యాప్త దాడులు ఏకకాలంలో నిర్వహించింది. కుంభకోణంలోని అవినీతిని మొత్తాన్ని కూపీలాగాలని ప్రయత్నాలు చేస్తుంది.












Click it and Unblock the Notifications