విమర్శలుకాదు, పరస్పర సహకారం కావాలి: రాంరెడ్డి దామోదర రెడ్డి

తెలంగాణ కోసం తెరాస నేతలతో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం, భాజపా పార్టీ వారు కూడా రెండు సార్లు రాజీనామా చేశారన్నారు. రాజీనామాలు చేయలేదని కేసిఆర్ నిత్యం వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. అలా అయితే ఆయన పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా విషయం ప్రశ్నించాల్సి వస్తుందన్నారు. పరస్పర ఆరోపణలు కాకుండా అందరూ కలిసి తెలంగాణ కోసం పోరాడాలన్నారు. కొందరు సీమాంధ్ర నేతలు తెలంగాణ వారిని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు.
గవర్నర్ నరసింహన్, డిజిపి అరవిందరావు అనవసర వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. శాంతిభద్రతలకోసం కేంద్ర బలగాలను తెప్పిస్తామనటం సమంజసం కాదన్నారు. ఉద్యమాన్ని అణచాలని చూస్తే ప్రజలు ఊరుకోరన్నారు. కాంగ్రెస్ అధిష్టానం గత సంవత్సరమే తెలంగాణ ఇచ్చిందన్నారు. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా అది వెనక్కి వెళ్లిందన్నారు.












Click it and Unblock the Notifications