ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవిని ప్రయోగిస్తుంది వారే: ఎర్రంనాయుడు

కాంగ్రెస్ పార్టీ వారే చిరంజీవితో అలా మాట్లాడిపించుతున్నారని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదన్నారు. గతంలో చిరంజీవికి, కాంగ్రెస్ పార్టీకి కుదిరిన ఒప్పందాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నిరాహార దీక్షతో ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి చూస్తే అది రాజకీయం అనిపించుకుంటుందా అన్నారు. కాంగ్రెస్ వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ధర్నాలు, దీక్షలు అధికారం కోసమా అని ఆయన ప్రశ్నించాు.
చంద్రబాబునాయుడి గురించి రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుకు మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబు అధికారం కోసమే దీక్ష చేస్తున్నారనడం విహెచ్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఢిల్లీలో ప్లీనరీ సమావేశాలకోసం పాటు పడుతున్న విహెచ్ రాష్ట్రంలో రైతుల సమస్యలను మరిచిపోయారన్నారు.












Click it and Unblock the Notifications