కెసిఆర్ భాష మార్చుకోవాలి: కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు

తమ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు కెసిఆర్ ను డిమాండ్ చేశారు. తాము ఒత్తిడి తేవడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు నిరుడు డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేశారని వారు చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో పెట్టించేందుకే తాము ఎంపిలుగా ఉన్నామని వారు చెప్పారు. రైతు సమస్యలను పరిష్కరిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. రైతు సమస్యలపై కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తో ఫోన్ లో మాట్లాడినట్లు వారు తెలిపారు. ఎఫ్ సిఐ చైర్మన్ తోనూ చర్చలు జరిపారని వారన్నారు.












Click it and Unblock the Notifications