జిల్లాలో నేనొక్కడినే మిగులుతా: జేసి సంచలన వ్యాఖ్యలు

JC Diwakar Reddy
అనంతపురం: అనంతపురం జిల్లా కాంగ్రెస్ లో చివరకు నేనొక్కడినే మిగులుతానని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జెసి దివాకర్ రెడ్డి మొదటిసారి అనంతపురం వెళ్లిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అనంత కాంగ్రెస్ లోని అందరు శాసనసభ్యులు మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్లే అవకాశాలున్నాయన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సైతం చెప్పానన్నారు.

కాగా మంత్రివర్గంలో ముఖ్యమంత్రి తనకు స్థానం కల్పించకపోవటంపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. కాంగ్రెస్ 156 మంది శాసనసభ్యులు ఉన్నారని, అందరికీ మంత్రి పదవులు ఇవ్వాలంటే ఎక్కడినుండి ఇవ్వగలరన్నారు. సమర్థులు అనుకున్న వారికే మంత్రి పదవులు ఇచ్చారన్నారు. తాను సమర్థుడనని నమ్మలేదు. కాబట్టి తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.

అయితే మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రిపైగానీ, కాంగ్రెస్ పార్టీపైగానీ ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. చంద్రబాబు దీక్ష పేరుతో రాద్దాంతం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారం కోసమే ఈ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. రైతులు చంద్రబాబును నమ్మె పరిస్థితి లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+