వైయస్ జగన్ వెంట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్

Udayabhanu
విజయవాడ : కృష్ణా జిల్లా కాంగ్రెస్‌లో వైయస్ జగన్ రాజకీయాలు సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధం దృష్ట్యా జగన్ వైపు వెళ్లడం తమకు అనివార్యమని జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, నందిగామ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. వీరిద్దరూ గురువారం తమ తమ నియోజకవర్గాల్లో కార్యకర్తలతో భేటీ అయ్యారు. తమ భావి రాజకీయ ప్రస్థానాన్ని వారికి వివరించారు. ఉదయభాను మాట్లాడుతూ, కాంగ్రెస్‌ను వీడడం తనకు బాధగా ఉన్నా వైఎస్ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

తనకు జగ్గయ్యపేట టిక్కెట్ దక్కడం వైఎస్ దయేనని చెప్పారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనసులో వైఎస్ ఉన్నారని, ఆ మనసులు జగన్‌ను బలపరుస్తున్నాయని అన్నారు. కార్యకర్తల మనోభావాల దృష్ట్యా తాను కూడా వైయస్ జగన్ వెంట నడుస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభావాలు అడిగి తెలుసుకున్న అనంతరం వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ - జగన్‌తోనే తన పయనమని చెప్పారు. రాష్ట్రానికి వైఎస్ వంటి సమర్థవంతమైన నాయకత్వం రావాలంటే జగన్‌ను సీఎం చేయాల్సి ఉందన్నారు. జగన్ వెంట.. తనతో పాటు ఎంపీ లగడ పాటి రాజగోపాల్‌ను కూడా తీసుకుపోవడానికి కృషి చేస్తానని చెప్పారు.

'జనం కోసం జగన్, జగన్ కోసం మేం' అన్న నినాదాలతో జగ్గయ్యపేట నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. కాబోయే సీఎం జగన్ అంటూ కార్యకర్తలు సభావేదికపై దూసుకు రావటంతో గంట సేపు ఏమి జరుగుతుందో అక్కడున్న ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఓ దశలో పోలీసులు లాఠీచార్జీకి సిద్ధపడగా కాంగ్రెస్ నేతలు ఆవేశంలో ఉన్న వారిని రెచ్చగొట్టినట్టు అవుతుందని వారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+