వైయస్ జగన్ అక్రమ సంపాదన నుంచి రైతులకు ఇవ్వవచ్చు కదా: విహెచ్

న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులపై అంతగా ప్రేమ ఉంటే అక్రమంగా సంపాదించుకున్న కోట్లాది రూపాయల నుండి ఎకరాకు 50వేల రూపాయలు ఇచ్చి సహాయం చేయవచ్చు కదా అని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు శుక్రవారం న్యూఢిల్లీలో ధ్వజమెత్తారు. మా నాన్న గారు ఉంటే ఇలా జరక్కపోయేది, మా నాన్న గారు ఉంటే ఇంత నష్టం కాకపోయేది అనటం జగన్ కు అలవాటయి పోయిందన్నారు. మా నాన్న రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్న జగన్ నాన్న దారిలో నడుస్తానంటున్నప్పుడు దీక్ష పేరుతో సమస్యలు సృష్టించకుండా రైతులను ఆదుకోవచ్చు కదా అని సూచించారు. సామూహిక దీక్ష పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఓ వైపు రైతు కష్టాల్లో ఉంటే జగన్ రెండు రోజులని, చంద్రబాబు నిరవధిక దీక్ష అని లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారన్నారు.

రైతుల కోసమంటున్న చంద్రబాబు నిరవధిక దీక్ష ఆయనకు ప్రచారం కోసమే పనికి వస్తుంది తప్ప రైతులకు ఏమాత్రమూ ఉపయోగపడదన్నారు. బాబ్లీ తరహాలో మళ్లీ తన ఇమేజ్ పెంచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అధికార కాంక్షతోనే ఆయన ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారన్నారు. ఎంత తొందరగా అధికారంలోకి రావాలా అని చూస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో కూర్చున్న చంద్రబాబు రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. దీక్షల పేరుతో కూర్చోకుండా ఢిల్లీకి వచ్చి రైతుల సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు.

దీక్షకు కూర్చుంటే పాపులారిటీ వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారన్నారు. దీక్షలు మానుకొని ఢిల్లీ వచ్చి రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే చంద్రబాబుకు మేం సైతం మద్దతు తెలుపుతామన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు చాలా ప్రాధాన్యం ఉంటుందని, ఆ ప్రాధాన్యాన్ని ఉపయోగించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. మహాత్మాగాంధీ, ఎన్టీఆర్, అంబేడ్కర్ లకు పూలమాలలు వేస్తే సరిపోదన్నారు. ప్రజలకోసం చిత్తశుద్దితో పని చేయాలన్నారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ లోని పార్లమెంటు సభ్యులం కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+