సోనియా గాంధీ నీచ స్థాయికి దిగజారిపోయారు: వైయస్ జగన్

YS Jagan
కడప: కేంద్రంలో కాంగ్రెసును రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చీల్చే నీచ స్థాయికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ దిగజారిపోయారని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆరోపించారు. కడప జిల్లాలోని పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో గల వేంపల్లి మండలం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన శుక్రవారం సాయంత్రం మాట్లాడారు. ఓదార్పు యాత్ర వద్దని చెప్పినప్పుడు గానీ, తన తల్లికి అపాయింట్ మెంటు ఇవ్వడానికి నెలలు తీసుకున్నప్పుడు గానీ, తనను పార్టీ నుంచి వెళ్లగొడతారని ప్రతి ఒక్కరూ అనుకుంటున్న సమయంలో గానీ తాను పెద్దగా బాధపడలేదని, అయితే తన చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డిని ఢిల్లీకి పిలిపించి, ఆశలు ప్రేరేపించి తన కుటుంబాన్ని చీల్చడానికి ప్రయత్నించడమే తనను ఎక్కువగా కలత పెట్టిందని ఆయన ఆన్నారు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పాదయాత్ర చేసి కాంగ్రెసును రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి తెచ్చిన మహా నేత వైయస్ కుటుంబాన్ని చీలుస్తున్నామనే ఆలోచన కూడా సోనియా చేయలేదని, అంత నీచ స్థాయికి సోనియా దిగజారిపోయారని ఆయన అన్నారు. వైయస్ వల్లనే సోనియా రాజ్యమేలుతున్నారని, ఆ విషయాన్ని సోనియా మర్చిపోయి కుటుంబాన్ని చీల్చారని ఆయన విమర్శించారు.

తనను కడప పార్లమెంటు నియోజకవర్గంలో కట్టడి చేయడానికి ఒక్క నియోజకవర్గం నుంచే ముగ్గురిని మంత్రులను చేశారని, దాంతో ఆగిపోరని, కడప పార్లమెంటు స్థానంలోని ప్రతి శానసభా నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇంచార్జీల రూపంలో తీసుకుని వస్తారని, ఉప ఎన్నికలు కాబట్టి పోలీసులను యధేచ్ఛగా వాడుతారని, డబ్బులు కుమ్మరిస్తారని ఆయన అన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా న్యాయమే గెలుస్తుందని, న్యాయం తన తరఫున ఉందని ఆయన అన్నారు. కడప పార్లమెంటు స్థానానికి, పులివెందుల స్థానానికి ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికలు దేశం యావత్తూ ఆసక్తిగా చూస్తున్నాయని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో తనను తన తండ్రిని ఆదరించినట్లు తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. వైయస్ మృతిపై సందేహాలను ఇప్పటి వరకు నివృత్తి చేయలేకపోయారని ఆయన అన్నారు. వైయస్ మృతికి కుట్ర జరిగిందని సందేహం వ్యక్తం చేసినందుకు సాక్షి కార్యాలయాలపై దాడులు చేయించారని, అనుమానాలు కూడా వ్యక్తం చేయలేని పరిస్థితి కల్పించారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+