వైయస్ జగన్ దీక్షకు అందరూ వస్తారు: అంబటి రాంబాబు

లక్ష్యదీక్షకు లక్షలాదిగా రైతులు, చే నేత కార్మికులు హాజరవుతారనే సంకేతాలు అందుతున్నాయని అంబటి చెప్పారు. అన్ని ఏర్పాట్లు చేశామని, చిన్న చిన్న ఇబ్బందులుంటే సహృదయంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చలి ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ విధిగా స్వెట్టర్లు, దుప్పట్లు, చలి బనీన్లు తెచ్చుకోవాలని కోరారు. భారీ వర్షాల దెబ్బకు వెన్ను విరిగిన రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలనే డిమాండ్లతోనే జగన్ దీక్ష చేస్తున్నారన్నారు. పెట్టుబడి రాయితీ రెట్టింపు చేయాలని, నష్ట పరిహారంగా రూ. 5 వేలు తక్షణమే ఇవ్వాలని, కౌలుదారులను ఆదుకోవాలని, రంగు మారిన-మొక్క మొలిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని 'లక్ష్యదీక్ష" డిమాండ్ చేస్తోందన్నారు. ఇవి జగన్ డిమాండ్లు మాత్రమే కావని, ప్రజల డిమాండ్లనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో ఓర్వలేక బాబు దీక్ష చేపట్టారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications