దెయ్యాలు వేదాలు వల్లించినట్లు దీక్ష: చంద్రబాబుపై కొండా సురేఖ ఫైర్

ప్రతిపక్ష నేతగా వైయస్ రాజశేఖర రెడ్డి రైతుల కోసం ఇచ్చిన సలహాలను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులకు రాష్ట్రంలో అభద్రతా భావం ఉందని, అందుకే ప్లీనరీ పేరుతో ఢిల్లీ వెళ్లిపోయారని ఆమె అన్నారు. అన్ని పార్టీలకూ వైయస్ జగన్ ఫోబియా పట్టుకుందని ఆమె అన్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు తన పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారని ఆమె అన్నారు. వైయస్ జగన్ దీక్ష చేపడుతున్నారు, ఏం చేయాలనే ఆందోళనలో కాంగ్రెసు నాయకులు ఉన్నారని ఆమె అన్నారు. వైయస్సార్ రైతు బిడ్డ అని, రైతు కంట కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదని వైయస్సార్ అనేవారని ఆమె అన్నారు. రైతుల పట్ల వైయస్ జగన్ కే నిజమైన ప్రేమ ఉందని ఆమె అన్నారు. తామంతా జగన్ వెంట ఉన్నామని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications