జగన్ తో 72 మంది ఎమ్మెల్యేలు, మరో 50 మంది వస్తారు: జూపూడి

కాగా, పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మంత్రి శంకర రావుపై తీవ్రంగా మండిపడ్డారు. జగన్ కు మద్దతిస్తున్న ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని శంకర్ రావు చేసిన వ్యాఖ్యపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. శంకరరావును నోటీసు పంపించమనండి, నేను రాజీనామా చేస్తా అని ఆయన అన్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేసే వైయస్ జగన్ ను పార్టీ నుంచి పంపించారని, జగన్ ను పంపించిన తర్వాత కాంగ్రెసు ఏమైందో చూస్తున్నామని ఆయన అన్నారు. వైయస్ జగన్ విషయంలో తనపై పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిడి లేదని, ఉంటుందని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. శంకరరావు నుంచి నీతులు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications