చంద్రబాబు ముందు నీ అనుభవమెంత: సిఎం కిరణ్ పై తలసాని ఫైర్

Talasani Srinivas Yadav
హైదరాబాద్: రైతాంగ సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి దీక్షను హైజాక్ చేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గత నాలుగు రోజులుగా మీడియాలో రైతులకు ప్రభుత్వం బాగా చేస్తుందంటూ యాడ్స్ ఇస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై వ్యంగంగా మాట్లాడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి అనుభవం ఎంత అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందన్నారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించటం లేదని విమర్శలు చేసే వారు ఆలోచించాలని జగన్ వర్గాన్ని, సాక్షిని ఉద్దేశించి అన్నారు.

చంద్రబాబుకు ఏమైనా అయితే రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా మిగలడన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై స్పందించదని ఇది మొండి ప్రభుత్వమని చంద్రబాబుకు చెప్పి దీక్ష విరమించాలని కోరినా ఆయన రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడటానికే నిశ్చయించుకున్నారన్నారు. కుటుంబ సభ్యులు చెప్పినా వినడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను, రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదన్నారు. రైతుల పేరుతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం రైతుల కోసం కాకుంటే ఇక ఎందుకు అని ప్రశ్నించారు. మంచి సాయం ప్రకటించామన్న ముఖ్యమంత్రి సాయం ప్రకటించాక కూడా రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీవ్రం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వచ్చి నెలరోజులు కూడా కాలేదు. అందులో పదిహేను రోజులు ఢిల్లీలోనే ఉన్నారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. రైతులకు నమ్మ బలకడానికి ఎప్పటి సాయమో ఇప్పుడు విడుదల చేస్తున్నారన్నారు. రైతులే దేశానికి వెన్నముక అని ప్రభుత్వం మరిచి పోతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+