తెదేపా సచివాలయ ముట్టడి ఉద్రిక్తం: ఎమ్మెల్యేలు సహా పలువురి అరెస్టు

Telugudesam
హైదరాబాద్: రైతాంగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిరవధిక నిరాహార దీక్షను విరమింప చేయడానికి చొరవ తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం, వామపక్షాలు నిర్వహించిన ఛలో సెక్రటరియేట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ టీడీఎల్పీ నుండి సచివాలయానికి ముట్టడికి ర్యాలీగా బయలు దేరిన వేలాది మంది తెదేపా, వామపక్ష కార్యకర్తలు బయలు దేరారు. శాసనసభ్యుడు మోత్కుపల్లి నరసింహులు సహా పలువురిని పోలీసులు రవీంధ్ర భారతి వద్ద అరెస్టు చేశారు. వారిని గోషామహల్ స్టేడియానికి తరలించారు.

కార్యకర్తలు కాంగ్రెసు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు వెంటనే సరియైన సాయం అందించాలన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే దిగి పోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సాయం అందించామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె నియమించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రైతుల సమస్యల పట్టడం లేదన్నారు. ఏ రైతుల పేరు చెప్పి గద్దెనెక్కారో ఆ రైతులు వీరిని గద్దె దింపడానికి సిద్ధంగా ఉందన్నారు.

ముందుగా వెళ్లిన శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకరరావు సహా మరికొందరు కార్యకర్తలు సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నాలు చేశారు. వారి యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు సచివాలయం ముందు బైఠాయించారు. మరికొందరు ముఖ్యమంత్రి బ్లాక్ ముందు కూర్చున్నారు. తెదేపా, వామపక్షాల ముట్టడి ఉండటంతో ప్రభుత్వం ముందుగానే భారీగా పోలీసులను మోహరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+