రాజాను 2జి స్పెక్ట్రమ్ స్కామ్ లో రెండో రోజూ ప్రశ్నిస్తున్న సిబిఐ

న్యూఢిల్లీ, చెన్నైలోని రాజా నివాసాల్లో సిబిఐ అధికారులు పెద్ద యెత్తున ఇటీవల సోదాలు చేశారు. ఈ సోదాల అనంతరం సిబిఐ అధికారులు ఆయనను ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు సమన్లు జారీ చేశారు. దాంతో రాజా శుక్రవారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. శుక్రవారం విచారణ అనంతరం బయటకు వచ్చిన రాజా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. తాను సిబిఐకి సహకరిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు జరుగుతున్నందున అంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications