ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: రైతు సమస్యల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తీవ్రంగా ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీలో శనివారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు ప్రకటించిన ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం మనసు మార్చుకోవాలని ఆయన సూచించారు. నియమనిబంధనలను పక్కన పెట్టి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఖజానా ఖాళీ అవుతుందనే భయంతో రైతులను ఆదుకోకపోవడం సరైంది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. రైతులకు ప్రకటించిన ప్యాకేజీని అమలు కూడా చేయడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం కంటితుడుపు చర్యగానే ఉందని ఆయన అన్నారు. రైతు సమస్యలపై జరుగుతున్న పోరాటాలను రాజకీయంగానే ప్రభుత్వం చూస్తోందని, మానవతా దృక్పథంతో చూడడం లేదని ఆయన అన్నారు. చేనేత కార్మికులను కూడా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+