ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సోమిరెడ్డి ఫైర్

Kiran Kumar Reddy
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలకు పంట నష్టానికి సంబంధం లేదనటం భావ్యం కాదు. రైతులు సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యలు చేసుకుంటే గానీముఖ్యమంత్రి ఆత్మహత్యలను, పంట నష్టానికి సంబంధం గుర్తించరా అని ప్రశ్నించారు. వారి పార్టీలోని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిటీ ఇవ్వమన్న నష్టపరిహారాన్నే తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.

మేం ఎక్కువ ఏం డిమాండ్ చేయడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రైతు సమస్యలకోసం చేసిన నిరవధిక దీక్షకు తెరాస, భాజపా, ప్రజారాజ్యం, కమ్యూనిస్టు పార్టీలతో పాటు పలువురు జాతీయ నాయకులు తమ మద్దతును ప్రకటించినప్పటికీ ప్రభుత్వం కళ్లు తెరవక పోవడం విడ్డూరమన్నారు.

భాజపా, తెరాస లు కూడా రైతు సమస్యలపై వారి వారి స్థాయిల్లో పోరాటం చేస్తున్నారన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నదన్నారు. రైతులకు మరింత సాయం అందించటం ద్వారానే ఆత్మహత్యలను ఆపవచ్చన్నారు. ముఖ్యమంత్రి లక్షలాది రైతులను పిలిచి కౌన్సిలింగ్ చేస్తారా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+