రఘువీరా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి వర్గాల మధ్య బాహాబాహీ

కేక్ కట్ చేస్తున్న సమయంలో జెసి వర్గీయులు రఘువీరా రెడ్డి వర్గీయులు జగన్ వర్గంలోకి వెళతారని నినాదాలు చేసినట్టు తెలుస్తుంది. అందుకు ప్రతిగా రఘువీరారెడ్డి అనుచరులు వారితో వాదానికి దిగారు. అదికాస్తా తీవ్ర ఘర్షణగా మారింది. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు కొట్టుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వచ్చి పరిస్థితిని సద్దుమణిచారు. అయితే కార్యకర్తలు కొట్టుకుంటున్న సమయంలో మంత్రులు అక్కడే ఉండటం గమనించదగ్గ విషయం. ఈ వేడుకలకు జేసి దివాకర్ రెడ్డి రాలేదు. కానీ జెసి ప్రభాకర్ రెడ్డి వచ్చారు.
అయితే ఈ గొడవకు జెసి దివాకర్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడమే కారణంగా కనిపిస్తోంది. జెసికి మంత్రి పదవి ఇస్తామని చెబితే అనంత కాంగ్రెసు కు చెందిన అందరూ శాసనసభ్యులు తాము పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పారు. రఘువీరారెడ్డి కూడా వారిని ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. జెసికి మంత్రి పదవి రాకుండా రఘువీరా, తదితరులు అడ్డుకోవడాన్ని జేసి వర్గీయులు జీర్ణించుకోలేక పోయారని తెలుస్తోంది. అయితే జెసి సైతం పలుమార్లు అనంతలో తానొక్కడినే కాంగ్రెసు లో మిగులుతానని పలుమార్లు చెప్పారు. రఘువీరాతో సహా అందరూ కాంగ్రెసు శాసనసభ్యలు జగన్ పంచన చేరుతారని జెసి భావిస్తున్నారు. వారు గోడమీది పిల్లుల వలె ఉంటున్నారని ఆయన భావిస్తున్నారు. ఇది కూడా వారి గొడవకు కారణం. సమావేశంలో కూడా జెసి వర్గీయులు రఘువీరా జగన్ వైపు వెళతారని నినాదాలు చేసినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications