సిఎం కిరణ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ సభలో జై తెలంగాణ

2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాటినుండి నేటి వరకు ఉచిత విద్యుత్తును ఇస్తుందని ముఖ్యమంత్రి మాట్లాడుతూ చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు. ప్రతిపక్షాలను కలుపుకొని అభివృద్ధి పనులపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలు సైతం దోహదం చేయాలన్నారు. రైతులకు మేలు చేయడానికి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రైతులకు వ్యవసాయ రుణాలు మాఫీ చేశామన్నారు. ఇది రైతు ప్రభుత్వమని చెప్పారు. రైతులు అప్పుల్లో కూరుకు పోయిన సందర్భాల్లో కేంద్రంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒత్తిడి తీసుకువచ్చి రైతులను ఆదుకోవడానికి కృషి చేసిందన్నారు. క్రికెట్ ఆడటానికి చాలాసార్లు నిజామాబాద్ కు వచ్చానని చెప్పారు.












Click it and Unblock the Notifications