తెలంగాణకై ఉద్యమిస్తాం, టిఆర్ఎస్ తో పని చేయం: నాగం జనార్ధన్ రెడ్డి

కాగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో ప్రజా గాయకుడు గద్దర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కొన్ని తీర్మాణాలు చేసింది. కేంద్ర ప్రభుత్వం మీడియాపై పెట్టిన ఆంక్షలు తొలగించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అప్రకటిత అత్యయిక స్థితిని తొలగించాలన్నారు. కమిటీ నివేదికకు ముందు రాష్ట్రవ్యాప్తంగా భారీగా కేంద్ర బలగాలను మోహరించారని వాటన్నింటిని వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రానున్న శీతాకాల సమావేశల్లో పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలనే తదితర తీర్మానాలు చేశారు. కాగా బిజెపి కూడా తెలంగాణపై పోరుకు సిద్ధమయింది. ఇందులో భాగంగా జనవరి 4వ తారీఖున ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మన రాష్ట్రానికి రానున్నారు. అదిలాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించే యోచనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications