సిఎం కిరణ్ కు క్రికెట్ పైనే అవగాహన ఎక్కువ: ఎర్రన్నాయుడు ఎద్దేవా

ముఖ్యమంత్రికి వ్యవసాయంపై అవగాహన, కౌలురైతుల కష్టాలు, పంట నష్టం అంచనాలు ఏమీ తెలియవని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యపై ఒక్కో పత్రికలో ఒక్కో విధంగా ఇస్తున్నాయని అందులో నిజాలు తెలుసుకొని ఇవ్వాలని సూచించటం సరియైనది కాదన్నారు. తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి పత్రికలను, ప్రతిపక్షాలను విమర్శించడమే ముఖ్యమంత్రి ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. కేంద్రం ప్రకటించిన 400 కోట్ల రూపాయల ప్యాకేజి ఎందుకూ సరిపోదన్నారు. కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు సాయం బాగుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications