రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి డికె అరుణ

300 కోట్ల రూపాయలు గ్రాంటుగా, 100 కోట్లు అడ్వాన్సుగా వచ్చాయన్నారు. పంట కొనుగోలు కేంద్రాల వద్ద ప్రత్యేకంగా సూపర్ వైజర్లను నియమించామని ఆమె తెలిపారు. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో తుఫానుల వల్ల భారీ నష్టాలు సంభవించాయన్నారు. రైతులు పంట నష్టపోయి తీవ్రంగా నష్టపోయారన్నారు. తీవ్రంగా నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. నవంబర్ వరకు పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. స్వామినాథన్ సిఫార్సుల మేరకు ఆదుకోవడానికి కృషి చేస్తామన్నారు.
ఇప్పటికే ఈ సంవత్సరం 4780 కోట్ల మేరకు పంట రుణాలు రీషెడ్యూల్ చేసినట్టు చెప్పారు. 2010 రుణాలు కూడా రీషెడ్యూల్ చేయాలని ఆర్బీఐని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 350 కోట్ల మేరకు 2010 ఖరీఫ్ రుణాలపై మాఫీ చేసిందని చెప్పారు. పండ్ల తోటలు, పట్టు, చేనేత వల్ల నష్టపోయిన వారికి కూడా ప్రత్యేక సాయం కోసం కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యాలను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు కేంద్రం కొంత మినహాయింపు ఇచ్చినట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications