సమైక్యాంధ్రను సీమాంధ్రలో పిడికెడు మందే కోరుతున్నారు: కెసిఆర్

కేంద్రం తెలంగాణకు కొత్తగా ఇచ్చేది ఏమీ లేదని, గతంలో ఇచ్చిన హామీనే నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. కేంద్రం తన హామీని నిలబెట్టుకోకుంటే ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు పోతుందన్నారు. వాళ్ల ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేసుకొని అక్కడే అభివృద్ధి చేసుకొవాలని ఆంధ్రా ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు మేరకు వచ్చిన మిగులు జలాల నీరు తెలంగాణకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అందులో 100 టిఎంసీల నీటిని మహబూబ్ నగర్ కు కేటాయించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications