అనైతికతను చిదంబరం ఆహ్వానం ప్రోత్సాహం: కెటి రామారావు

K Taraka Ramarao
హైదరాబాద్: జనవరి 6వ తేదీ సమావేశానికి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం పార్టీకి ఇద్దరిని ఆహ్వానించడం అనైతికతను ప్రోత్సహిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు అభిప్రాయపడ్డారు. పార్టీకి ఇద్దరిని అహ్వానించడం వల్ల పార్టీలు ద్వంద్వ విధానాలను అవలంబించే అవకాశం ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సమావేశానికి పార్టీ అధ్యక్షులను ఒక్కరినే ఆహ్వానించాలని, పార్టీ విధానాన్ని మాత్రమే చెప్పాలని సూచించాలని ఆయన అన్నారు.

ఎంబిఎ మార్గదర్శక సూత్రాలను పాటించాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అంబికా సోనీ ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఒక ప్రైవేట్ సంస్థ నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలను పాటించాలని సూచించడం సరైంది కాదని ఆయన అన్నారు. మీడియాతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలు ప్రాంతీయ ఉద్వేగాలతోనే వ్యవహరిస్తున్నాయని, మీడియా సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఆ స్థితిలో మీడియాపై ఆంక్షలకు ఆర్థం లేదని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు అపనమ్మకంతో ఉన్నారని, ఆ అపనమ్మకంతోనే ఆత్మహత్యలు జరిగాయని, ఈ స్థితిలో పెద్ద యెత్తున బలగాలను మోహరించడం వల్ల అపనమ్మకం మరింతగా పెరుగుతుందని, ముందు జాగ్రత్తగానే బలగాలను మోహరించామని చిదంబరం చెప్పడం సరిపోదని ఆయన అన్నారు. బలగాల మోహరింపుపై చిదంబరం వివరంగా సమాధానం చెప్పాలని, కేంద్ర బలగాలను ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండడం నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ఒక వెసులుబాటును కల్పించుకోవడానికేనని, తెలంగాణ ఏర్పాటు తప్ప మరో విధంగా వెళ్తే అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజారుతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+