కె చంద్రశేఖరరావు, చంద్రబాబులపై ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గుంటూరులో ఏర్పాటు చేస్తున్న రైతుకోసం బహిరంగ సభ ఓ రాజకీయ డ్రామాగా కొట్టి పారేశారు. రైతులను నమ్మించడానికి టిడిపి రాజకీయ షోకు పూనుకున్నదన్నారు. వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు రైతుల కోసం పోరాడుతున్నారంటే రైతులు నమ్మే స్థితిలో లేరన్నారు. రైతులపై బాబుది ముసలి కన్నీరన్నారు. తనపై ఉన్న అపవాదును పోగొట్టుకోవడానికి ఆయన రైతుల కోసమంటూ గళమెత్తుతున్నారన్నారు.
కాగా తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా వచ్చినా రాష్ట్రంలోని ప్రజలందరూ సంయమనంతో ఉండాలని ఆయన కోరారు. కమిటీ నివేదిక ఎలా వచ్చినా అనవసర ఉద్రేకాలకు లోనుకావద్దని సూచించారు. అనుకూలంగా లేదని భావిస్తే శాంతిమార్గంలో మన ఆకాంక్షను తెలియజేద్దామని చెప్పారు.












Click it and Unblock the Notifications