విశాఖలో జగన్ ఓదార్పు యాత్ర: మంత్రులతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

జగన్ ఓదార్పు యాత్రకు శాసనసభ్యులు వెళ్లకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించినట్లు సమాచారం. వైయస్ జగన్ తో పాయకరావు పేట శాసనసభ్యుడు బాబూరావు వెళ్లే అవకాశం ఉందని మంత్రులు ముఖ్యమంత్రికి తెలిపినట్లు సమాచారం. వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి సహకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ ఓదార్పు యాత్రను విఫలం చేసేందుకు జిల్లా మంత్రులు విశాఖపట్నం కాంగ్రెసు నాయకులు, శాసనసభ్యులతో సమావేశమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications