డిఎంకెలో విభేదాలు: రాజా వ్యవహారంపై అళగిరి రాజీనామా

Alagiri
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి నాయకత్వంలోని డిఎంకెలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. కరుణానిధి కుమారుడు అళగిరి తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిగా ఉన్నారు. డిఎంకె కార్యనిర్వహణ కార్యదర్శి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిక్కుకున్న మాజీ టెలికం మంత్రి ఎ రాజాను అన్ని పార్టీ పదవుల నుంచి తప్పించాలని, పార్లమెంటు సభ్యురాలు, కరుణానిధి కూతురు కనిమొళిపై చర్యలు తీసుకోవాలని అళగిరి డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

తన రాజీనామా లేఖను అళగిరి మంగళవారం రాత్రి తన తండ్రి కరుణానిధికి సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే, ఇంకా అది ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయానికి చేరుకోలేదు. తన తండ్రిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే అళగిరి రాజీనామా లేఖను ప్రయోగించినట్లు చెబుతున్నారు. తన వారసుడిగా తన మరో కుమారుడు స్టాలిన్‌ను ముందుకు తేవడానికి కరుణానిధి ప్రయత్నిస్తున్నారు. దీంతో అళగిరి కరుణానిధిపై తీవ్రంగా ఒత్తిడి తేస్తూ వస్తున్నారు. కేంద్ర మంత్రిగా తనను పంపి, స్టాలిన్‌కు ముఖ్యమంత్రి పదవి, పార్టీ పదవి కట్టబెట్టాలని కరుణానిధి చూస్తున్నారనేది అళగిరి అభియోగం. రాష్ట్ర రాజకీయాల్లో తాను ప్రధాన పాత్ర వహించే ఉద్దేశంతో అళగిరి ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+